శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌కు భారత్‌లో ప్రీ ఆర్డర్లు షురూ


శాంసంగ్‌ తన నూతన ఇయర్‌బడ్స్‌.. గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌ను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఇయర్‌బడ్స్‌కు గాను భారత్‌లో ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీటిని మార్చి 6వ తేదీ నుంచి భారత్‌లో విక్రయించనున్నారు. రూ.11,990 ధరకు వీటిని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇక గెలాక్సీ ఎస్‌20 ఫోన్లను ప్రీ ఆర్డర్‌ చేసిన వారికి కేవలం రూ.1990కే ఈ ఇయర్‌బడ్స్‌ను అందివ్వనున్నారు. వీటిని బ్లూటూత్‌ 5.0 ద్వారా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇవి 22 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు.