శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో వర్మ

 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దిశ కథాంశంపై వివరాలను సేకరించడంలో భాగంగా వర్మ ఇవాళ శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ ను కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.


అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ..దిశ ఘటనలో వివరాలు తెలుసుకునేందుకు అందరిని కలుస్తున్నా. అయితే ఎవరిని కలుశాను.? వారినేం అడిగాను..? వారేం చెప్పారనేది ఇప్పడే చెప్పలేను..వారంతా నాకు సహకరిస్తున్నారు. ఈ సినిమాను వివాదాలతో సంబంధం లేకుండా భావోద్వేగపూరిత కోణాన్ని చూపించాలనేది నా ప్రయత్నం. సినిమా అనేది కళ్లకు కట్టినట్లు చూపించడానికి చేసే ప్రయత్నం. మీడియాలో రిపోర్టు చేసేది ఒక వార్తలాగా వస్తుంది. రెండింటికి తేడా ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు వర్మ.