మరోసారి 'మహర్షి' కాంబినేషన్

మరోసారి 'మహర్షి' కాంబినేషన్


గత కొద్ది రోజులుగా మహర్షి చిత్రం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా స్పందించాడు. మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్టు తెలిపాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రస్తుతం లొకేషన్ వేటలో ఉన్నాడట. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉండగా, ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. అనీల్ రావిపూడి చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు.